Nagababu: గరికపాటితో క్షమాపణలు చెప్పించుకోవాలని మేం కోరుకోలేదు: నాగబాబు

Nagababu responds on Garikapati issue

  • అలయ్ బలయ్ లో ఘటన
  • చిరంజీవిపై గరికపాటి అసహనం
  • మెగా అభిమానుల్లో ఆగ్రహం
  • గరికపాటి క్షమాపణలు చెప్పారంటూ వార్తలు
  • స్పందించిన నాగబాబు

నిన్న అలయ్ బలయ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాల పట్ల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. 

ఈ క్రమంలో, మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. 

అయితే, గరికపాటి లాంటి పండితుడు అలా అనకుండా ఉండాల్సిందన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలని మాత్రమే భావించామని అన్నారు. అంతేతప్ప, ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవాలని తాము కోరుకోలేదని నాగబాబు స్పష్టం చేశారు.

ఏదేమైనా మెగా అభిమానులు గరికపాటిని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు.

Nagababu
Garikapati
Chiranjeevi
Alay Balay
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News