Team India: తొలి వన్డేలో టీమిండియా టార్గెట్ 40 ఓవర్లలో 250 రన్స్

SA set 250 runs target for Team India in 1st ODI

  • వర్షం వల్ల ఓవర్లు 40కి కుదింపు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 రన్స్ చేసిన సఫారీలు
  • మిల్లర్, క్లాసెన్ అర్ధసెంచరీలు

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. లక్నోలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ లో ఓవర్లను 40కి తగ్గించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ కు దిగిన సఫారీలు భారీ స్కోరు సాధించారు. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్) దూకుడుగా ఆడి అర్ధసెంచరీలు నమోదు చేయగా... దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. 

అంతకుముందు, క్వింటన్ డికాక్ 48, జానెమన్ మలాన్ 22 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ టెంబా బవుమా (8) విఫలం కాగా, ఐడెన్ మార్ క్రమ్ (0) డకౌట్ అయ్యాడు. 

టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్ 1, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ఓ అద్భుతమైన బంతితో మార్ క్రమ్ ను బౌల్డ్ చేయడం హైలైట్ గా నిలిచింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 22 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలోనే లభించాయి. టీమిండియా బౌలర్లు ఏకంగా 15 వైడ్లు విసిరారు.

Team India
South Africa
1st ODI
Lucknow
  • Loading...

More Telugu News