Kidnapped: ఘోరం.. అపహరణకు గురైన భారత సిక్కు కుటుంబం హత్య

Kidnapped Sikh family including 8 month old baby found dead in California

  • కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కంట్రీలో వెలుగు చూసిన మృతదేహాలు
  • 8 నెలల పసికందునూ విడిచిపెట్టని అగంతకుడు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఘోరం జరిగింది. కాలిఫోర్నియాలో అపహరణకు గురైన నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం, 8 నెలల చిన్నారి (కుమార్తె)  సహా హత్యకు గురైంది. కాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటన చేశారు. ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు.. 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు. 

వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. గత సోమవారం ఉదయం వీరంతా అపహరణకు గురవడం తెలిసిందే. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు వార్న్ కే ప్రకటించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సీరియస్ గా ఉండడంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. జస్ దీప్ సింగ్ ఇటీవలే ట్రక్ రెంటింగ్ కంపెనీని ప్రారంభించాడు. అతడి కుటుంబ సభ్యులు అందరినీ అక్కడి నుంచే నిందితుడు అపహరించుకుపోయాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియోు ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. 

Kidnapped
Sikh family
found dead
California
  • Loading...

More Telugu News