Jio fiber: జియో ఫైబర్ ప్లాన్లపై ‘ఫెస్టివ్ బొనాంజ’

Jio announces limited period festive offer with up to Rs 4500 benefits
  • రూ.599, రూ.899 ప్లాన్లపై ఆఫర్లు
  • మూడు నుంచి ఆరు నెలల పాటు అదనపు ప్రయోజనాలు
  • రిలయన్స్ డిజిటల్, అజియో, మింత్రా ఓచర్లు
రిలయన్స్ జియో సంస్థ తన జియో ఫైబర్ (బ్రాడ్ బ్యాండ్) కస్టమర్ల కోసం రెండు ప్లాన్లపై ‘ఫెస్టివల్ బొనాంజ’పేరుతో అదనపు ప్రయోజనాలను ప్రకటించింది. దీని కింద కొత్తగా రూ.599 లేదా రూ.899 ప్లాన్లను తీసుకునే కస్టమర్లకు రూ.4,500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 9 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. నిజానికి రూ.599, రూ.899 కొత్త ప్లాన్లు కావు. ఎప్పటి నుంచో ఉన్నవే. కాకపోతే వీటిపై అదనపు ప్రయోజనాలను పండుగ సందర్భంగా జియో ఆఫర్ చేస్తోంది.

రూ.599 ప్లాన్
ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. 30 ఎంబీపీఎస్ వేగంతో, నెల మొత్తం మీద 3.3టీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, మరో 12 ఓటీటీ సేవలను ఉచితంగా ఇస్తోంది. 550కు పైగా చానల్స్ ను కూడా వీక్షించొచ్చు. ఆరు నెలల పాటు మొత్తం రూ.4,500ల ప్రయోజనాలు లభిస్తాయి. రిలయన్స్ డిజిటల్ లో కొనుగోళ్లపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. రూ.1,000 మింత్రా ఓచర్ కూడా వస్తుంది. రూ.1,000 అజియో ఓచర్, రూ.1,500 ఇక్సిగో ఓచర్ ఇందులో భాగంగా ఉచితంగా వస్తాయి. 

రూ.899 ప్లాన్
ఇందులో వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. రోజువారీ 100 ఎంబీపీఎస్ వేగంతో డేటాను వాడుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోలీ లివ్, జీ5 తోపాటు మరో 12 ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా వీక్షించొచ్చు. 550కు పైగా టీవీ చానల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్లాన్ లో రూ.3,500 విలువైన ప్రయోజనాలు మూడు నెలల పాటు పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్ రూ.500 ఓచర్, మింత్రా రూ.500 ఓచర్, అజియో రూ.1,000 ఓచర్, ఇక్సిగో రూ.1,500 ఓచర్ కూడా లభిస్తాయి.
Jio fiber
festive offers
Rs 4500 benefits

More Telugu News