Jio laptop: జియో ల్యాప్ టాప్ విక్రయాలు మొదలు.. ధర రూ.19,500

Jio laptop launched in India under Rs 20000 but not everyone can buy it yet
  • రిటైల్ కస్టమర్ల కోసం కాదు..
  • ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ పై అందుబాటులోకి
  • ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలకే కొనుగోలు అవకాశం
  • రిటైల్ కస్టమర్లు మరికొంత కాలం వేచి చూడాల్సిందే
కేవలం రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. జియో నుంచి మరో సంచలనం అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానే జియో ల్యాప్ టాప్ సైలెంట్ గా విడుదల అయింది. కానీ, దీన్ని రిటైల్ కస్టమర్లు కొనుగోలు చేయలేరు. ఎందుకంటే రిలయన్స్ జియో ఈ ల్యాప్ టాప్ ను ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ (జీఈఎం)పై విక్రయాలకు ఉంచింది. దీని ధర రూ.19,500.

జీఈఎం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసుకోగలవు. మరి అందరికీ ఈ ల్యాప్ టాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. దీపావళి నాటికి జియో ల్యాప్ టాప్ రిటైల్ కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. దీన్ని దేశీయంగానే తయారు చేసినట్టు జియో ప్రకటించింది. 

11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1366/768 పిక్సల్స్ రిజల్యూషన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ అంటే ఈ ల్యాప్ టాప్ పవర్ ఫుల్ కాదని తెలుస్తోంది. పైగా ర్యామ్ సైజు కూడా తక్కువే. ధర తక్కువగా నిర్ణయించినప్పటికీ, ల్యాప్ టాప్ కాన్ఫిగరేషన్ ఆధారంగా చూస్తే ఇదేమీ చౌక కాదని తేలిపోతోంది. బేసిక్ అవసరాలకు, ఆన్ లైన్ క్లాస్ లకు ఇది బాగానే ఉపయోగపడుతుంది. 
Jio laptop
launched
sales started
Government e-Marketplace
GeM

More Telugu News