Flipkart: ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ దసరా సేల్’ రేపటి నుంచే

Flipkart Big Dussehra sale begins for Plus users

  • ఈ నెల 8 వరకు ప్రత్యేక విక్రయాలు
  • యాపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్
  • హెచ్ డీఎఫ్ సీ కార్డులపై 10 శాతం అదనపు తగ్గింపు

దసరా, దీపావళి ఇవి వరుస వెంట వచ్చే ముఖ్యమైన పండుగలు. అంతేకాదు, ఎక్కువ మంది ఈ సమయంలోనే తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో డిమాండ్ కు తగ్గట్టు ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పోటా పోటీగా పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలను చేపడుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ పూర్తయిన ఐదు రోజులకే ఫ్లిప్ కార్ట్.. బిగ్ దసరా సేల్ పేరుతో మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలను నిర్వహిస్తోంది. 

ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు బిగ్ దసరా సేల్ విక్రయాలు మంగళవారం ప్రారంభం కాగా, మిగిలిన అందరికీ ఈ నెల 5 నుంచి బిగ్ దసరా సేల్ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తోంది. 

ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ తదితర ఫోన్లను కనిష్ట ధరల్లో ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులపై ఆఫర్ ను కూడా కలిపి చూస్తే.. ఐఫోన్ 13 రూ. 57 వేలకు, ఐఫోన్ 13 మినీ రూ. 35,990కు, ఐఫోన్ 11 రూ. 34,490కు లభిస్తోంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రోపైనా డిస్కౌంట్ ఉంది.

Flipkart
Big Dussehra sale
begins
offers
big discounts
  • Loading...

More Telugu News