Kriti Sanon: చెమటతో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు దుపట్టా ఇవ్వబోయిన కృతి సనన్

Kriti Sanon offers her dupatta to Prabhas to wipe his sweat with at Adipurush teaser launch Watch video

  • ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేదికపై అరుదైన దృశ్యం
  • లైట్ల వేడికి ఉక్కపోత వాతావరణం
  • చెమటతో ఇబ్బంది పడ్డ ప్రభాస్

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేదికపై అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. రామాయణం కథాంశంగా నిర్మించిన ఆదిపురుష్ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహించడం తెలిసిందే. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు. 

అయితే టీజర్ విడుదల వేదికపై ప్రభాస్ ఉక్కపోతకు ఇబ్బంది పడడం కనిపించింది. స్టేజ్ పై ఏర్పాటు చేసిన అధిక కెపాసిటీ లైట్ల వేడికి ప్రభాస్ నుదుట చెమటలు కక్కుతుంటే, అతడు చేత్తో తొలగించుకోవడం కెమెరాల్లో రికార్డ్ అయింది. పక్కనే ఉన్న కృతి సనన్ దీన్ని గమనించి తన దుపట్టా అంచును తీసి ప్రభాస్ కు ఇవ్వబోయింది. కానీ, ప్రభాస్ దాన్నేమీ పట్టించుకోనట్టు తన చేత్తోనే చెమటను తుడుచుకోవడం కనిపించింది. ప్రభాస్ తెల్లటి పైజామా, కుర్తాతో కనిపించాడు. కృతి సనన్ బంగారు వర్ణం డ్రెస్ తో వేడుకకు వచ్చింది.

Kriti Sanon
offred
dupatta
Prabhas
sweating
adipurush
teaser
  • Loading...

More Telugu News