Mahatma Gandhi: మహిషాసురుడుకి మ‌హాత్మా గాంధీ ముఖం... కేంద్ర హోం శాఖ సీరియ‌స్‌

Mahatma Gandhi as Mahishasura at Hindu Mahasabhas pandal in Kolkata sparks controversy

  • కోల్‌క‌తాలో ఓ దుర్గా మాత మండ‌పంలో ఘ‌ట‌న‌
  • ఫిర్యాదు రావ‌డంతో వెంట‌నే స్పందించిన హోం శాఖ‌
  • తొలగించిన నిర్వాహ‌కులు

కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో మ‌హాత్మా గాంధీని మహిషాసురుడుగా చూపించడంపై వివాదం చెల‌రేగింది. ఓ మండ‌పంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మ‌హిషాసురుడికి గాంధీ ముఖాన్ని పెట్టారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న‌ కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు రావ‌డంతో పూజ నిర్వాహకులు ముఖాన్ని మార్చారు. అఖిల భారతీయ హిందూ మహాసభ ఫిర్యాదు త‌ర్వాత‌ పోలీసుల సూచనల మేరకు విగ్రహం రూపు రేఖలు మార్చారు. 

ఈ విష‌యమై అఖిల భార‌త‌ హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామిని ఓ ఆంగ్ల మీడియా సంస్థ సంప్రదించ‌గా.. " మేము గాంధీని నిజమైన అసురుడిగా చూస్తాము. అయ‌నే నిజమైన అసురుడు. అందుకే మేము దేవ‌తా మూర్తిని ఇలా తయారు చేశాము. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని ప్రమోట్ చేస్తోంది. మేము బలవంతంగా మూర్తిని తొలగించి దానిని మార్చాము. హోం మంత్రిత్వ శాఖ మాపై ఒత్తిడి తెచ్చింది. గాంధీని అన్ని చోట్ల నుంచి తొలగించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ముందు ఉంచాలనుకుంటున్నాము" అని గోస్వామి అన్నారు. 

అయితే, ఈ చ‌ర్య‌ను బెంగాల్ లోని  అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. దీనిపై బెంగాల్  హిందూ మహాసభ స్పందించింది. ఇలా చేసింది నిజ‌మైన హిందూ మ‌హా స‌భ కాద‌ని తెలిపింది.

Mahatma Gandhi
Mahishasura
kolkata
home ministry
  • Loading...

More Telugu News