Team India: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక

Team India for ODI series with South Afirca announced
  • అక్టోబరు 6 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్
  • శిఖర్ ధావన్ కు టీమిండియా కెప్టెన్సీ
  • వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్
  • అరంగేట్రం చేయనున్న రజత్ పాటిదార్, ముఖేశ్ కుమార్
ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసిన అనంతరం మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ లో పాల్గొనే టీమిండియాను ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ నేడు ఎంపిక చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అక్టోబరు 6న తొలి వన్డే జరగనుంది. అక్టోబరు 9న రెండో వన్డే, అక్టోబరు 11న మూడో వన్డే జరగనున్నాయి. కాగా, ఈ సిరీస్ కోసం కొన్ని కొత్త ముఖాలకు సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు. ముఖేశ్ కుమార్, రజత్ పాటిదార్ జాతీయ జట్టులో అరంగేట్రం చేయనున్నారు. ఇక అవేష్ ఖాన్, సిరాజ్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు.

టీమిండియా వన్డే జట్టు...
శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మాన్ గిల్, రజత్ పాటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్.
Team India
ODI Team
South Africa
ODI Series

More Telugu News