Team India: రెండో టీ20: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... టీమిండియాకు బ్యాటింగ్

South Africa won the toss and handed Team India batting

  • గువాహటిలో మ్యాచ్
  • అదే జట్టుతో బరిలో దిగుతున్న టీమిండియా
  • ఒక మార్పు చేసిన దక్షిణాఫ్రికా
  • షంసీ స్థానంలో ఎంగిడీకి స్థానం
  • సిరీస్ పై కన్నేసిన టీమిండియా

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు గువాహటిలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. కాగా, తొలి టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ బరిలో దింపుతున్నామని టీమిండియా సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ను తాను పరిశీలించానని, ఆరంభ ఓవర్లలో జాగ్రత్తగా ఆడడం అవసరమని అభిప్రాయపడ్డాడు. 

అటు, దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. స్పిన్నర్ తబ్రైజ్ షంసీ స్థానంలో ఎంగిడీని తుదిజట్టులోకి తీసుకున్నట్టు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో నెగ్గి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇవాళ్టి మ్యాచ్ లో కూడా గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా...
టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రూసో, ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, ఆన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడీ.

Team India
South Africa
Toss
Batting
  • Loading...

More Telugu News