Dare devils: నిప్పుల గుండం కాదు.. అగ్ని పర్వతంపై రోప్​ వాకింగ్​. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో

Daredevils rope walk over active volcano

  • ఓ వైపు లావా, పొగలు ఎగిసి పడుతుండగానే రోప్ వాక్ చేసిన ధీరులు
  • తమ ఫీట్ తో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన వైనం
  • ఇంతకు ముందు ఆకాశంలో హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య కట్టిన తాడుపైనా వాకింగ్ రికార్డు

రోప్ వాకింగ్ సాధారణమే. మనం చిన్నప్పుడు జాతరల్లో, ఎగ్జిబిషన్లలో చూసినదే. కొందరైతే మరీ ప్రొఫెషనల్ గా అత్యంత ఎత్తులో, పెద్ద పెద్ద భవనాలకు తాళ్లు కట్టి వాటి మీద నడుస్తుంటారు. ఇక అక్కడక్కడా నిప్పుల గుండం మీద నడక వంటివీ మామూలే. ఈ రెండింటినీ కలిపి.. అత్యంత భయానకమైన ఫీట్ చేస్తే.. అది అగ్నిపర్వతం మీద రోప్ వాకింగ్. వామ్మో అనిపిస్తుంది కదా. ఇద్దరు ధైర్య వంతులు ఈ ఫీట్ ను చేసి చూపించి గిన్నిస్ రికార్డులకు ఎక్కారు.

పడిపోతే బూడిదా మిగలని స్థితిలో..
అది అసలే యాక్టివ్ గా ఉన్న అగ్ని పర్వతం. పొరపాటున పడిపోతే లావాలో మాడిపోయి.. బూడిద కూడా మిగలదు. అలాంటి చోట బ్రెజిల్ కు చెందిన రాఫెల్ బ్రీడీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ షూల్జ్ రోప్ వాకింగ్ చేశారు. టాన్నా ద్వీపంలో ఉన్న అగ్ని పర్వతంపై 846 అడుగుల పొడవున, 137 అడుగుల ఎత్తులో ఈ ఫీట్ ను సాధించారు. ఓ వైపు లావా ఎగసి పడుతుండగానే.. వారు రోప్ వాకింగ్ చేసిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉండటం గమనార్హం.
  • గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో వ్యూస్ నమోదవుతున్నాయి.
  • ‘ఇంత రిస్క్ తీసుకుని రోప్ వాక్ చేయడం ఎందుకు?’ అని కొందరు నెటిజన్ల నుంచి ప్రశ్నలు వస్తుంటే.. ‘బాగా ధైర్యవంతులే..’ అని మరికొందరు పేర్కొంటున్నారు.
  • ఇంతకు ముందు రాఫెల్ బ్రీడీ అంతరిక్షంలో ఎగురుతున్న రెండు హాట్ ఎయిర్ బెలూన్ల మధ్య 6,236 అడుగుల ఎత్తులో కట్టిన తాడుపై రోప్ వాక్ చేసి రికార్డు సృష్టించాడు కూడా. బ్రెజిల్ లోని శాంటా కాటరినా ప్రాంతంలో ఆ ఫీట్ చేశాడు. 

Dare devils
Rope walking
Rope walking on Valcano
Brazil
Offbeat
Viral Videos
  • Loading...

More Telugu News