mahatma gandhi: మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు

PM Modi leads nation in paying tributes on Gandhi Jayanti

  • బాపూ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలన్న ప్రధాని
  • ఖాదీ, చేనేత ఉత్పత్తులను వినియోగించాలని పిలుపు
  • రాష్ట్రపతి, ప్రతిపక్ష నేతలు సైతం నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఘన నివాళి అర్పించారు. ఆదివారం గాంధీ 153వ జయంతి. దీంతో రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్దకు వెళ్ళిన ప్రధాని పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి గాంధీ నాయకత్వం వహించడం తెలిసిందే. గాంధీ తన ఉద్యమంలో ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యం ఇచ్చారు. అహింస ఆయన నమ్మే సిద్ధాంతం. అందుకే గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి 2007 నుంచి అమలు చేస్తోంది.

‘‘మహాత్మా గాంధీకి నివాళులు. నేటి గాంధీ జయంతి మరింత ప్రత్యేకం. ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. బాపూ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ప్రజలు ఖాదీ, చేతి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గాంధీకి నివాళి అర్పించాలి’’అని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం గాంధీకి నివాళులు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తదితరులు సైతం రాజ్ ఘాట్ ను సందర్శించి గాంధీకి నివాళులు అర్పించారు. 


  • Loading...

More Telugu News