Nagarjuna: "ఇంతకీ ఎవడు వాడు?"... 'ది ఘోస్ట్' రిలీజింగ్ ట్రైలర్ ను పంచుకున్న నాగార్జున

  • నాగ్ హీరోగా ది ఘోస్ట్
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చిత్రం
  • అక్టోబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్
  • ఆకట్టుకునేలా ఉన్న తాజా ట్రైలర్
Nagarjuna shares The Ghost releasing trailer

నాగార్జున ప్రధానపాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది ఘోస్ట్'. ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీ రిలీజింగ్ ట్రైలర్ ను నాగార్జున ట్విట్టర్ లో పంచుకున్నారు. గతంలో విడుదల చేసిన ట్రైలర్ తరహాలోనే ఈ లేటెస్ట్ ట్రైలర్ కూడా భారీ పోరాట ఘట్టాలతో ఆకట్టుకునేలా ఉంది. 

"ఇంతకీ ఎవడు వాడు?"... అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నాగ్ ను 'ది ఘోస్ట్' గా ఇంట్రడ్యూస్ చేసే సీన్ ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. ఫారెన్ లొకేషన్లలో చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్ లను తాజా ట్రైలర్ లో చూడొచ్చు. 

కాగా, 'ది ఘోస్ట్' చిత్రం అక్టోబరు 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ కథనాయిక కాగా, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హుస్సేన్ ఇతర పాత్రలు పోషించారు. 

ఈ చిత్రానికి భరత్-సౌరభ్ ద్వయం, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు.

More Telugu News