Srinivasulu Reddy: సీఎం సొంత జిల్లాను మాఫియా కేంద్రంగా మార్చేశారు: టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి

YSRCP leaders makes Kadapa as mafia center says TDP

  • వైసీపీ నేతలు మైనింగ్, మట్టి, ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్న శ్రీనివాసులు రెడ్డి 
  • టీడీపీ ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని వ్యాఖ్య 
  • అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని విమర్శ 

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపను వైసీపీ నేతలు మాఫియా కేంద్రంగా మార్చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా మైనింగ్, మట్టి, ఇసుక దోపిడీకి పాల్పడుతూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు భరత్ రెడ్డి కొండను కరిగిస్తూ మాఫియాకు పాల్పడుతున్నారని అన్నారు. 

కడప శివార్లలో జరుగుతున్న మైనింగ్ మాఫియాపై టీడీపీ ఫిర్యాదు చేయడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. చలమారెడ్డి పల్లెలో ఎంత మేర మట్టిని తోడేశారో మైనింగ్ అధికారులు సర్వే చేయలేదని అన్నారు. తూతూ మంత్రంగా సర్వే చేసి రూ. 2 కోట్లు పెనాల్టీ వేశారని... పక్కాగా సర్వే చేస్తే రూ. 10 కోట్ల మేర ఆదాయానికి గండికొట్టినట్టు తేలుతుందని చెప్పారు. వైసీపీ నేతలు ఆదాయానికి గండి కొడుతుంటే... మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

Srinivasulu Reddy
Telugudesam
Kadapa
Mafia
  • Loading...

More Telugu News