God Father: అనంతపురంలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం

God Father pre release event starts in Anantapur

  • చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్
  • మోహన్ రాజా దర్శకత్వంలో చిత్రం
  • అక్టోబరు 5న రిలీజ్
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా తరలివచ్చిన అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ 'గాడ్ ఫాదర్'. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి కిందటే ఈ వేడుక ప్రారంభమైంది. అనంతపురంలో ఈ ఉదయం నుంచే మెగా కోలాహలం నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు అనంతపురంకు భారీగా తరలివచ్చారు. 

ప్రీ రిలీజ్ వేడుకకు ఇక్కడి ఆర్ట్స్ కాలేజీ మైదానం వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఇసుకేస్తే రాలనంతగా జనంతో క్రిక్కిరిసిపోయింది. ప్రముఖ యాంకర్లు రవి, హరితేజ ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. 

మలయాళంలో సూపర్ హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. తెలుగు వెర్షన్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. ఇందులో నయనతార కీలకపాత్ర పోషించగా, సత్యదేవ్ ప్రతినాయకుడిగా నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న 'గాడ్ ఫాదర్' చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
.

God Father
Chiranjeevi
Megastar
Pre Release Event
Anantapur
Tollywood
  • Loading...

More Telugu News