Team India: దక్షిణాఫ్రికాతో తొలి టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss against SA
  • మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం
  • తిరువనంతపురంలో మొదటి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • స్టేడియానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇటీవల ఆసీస్ పై సిరీస్ గెలిచి ఊపుమీదున్న టీమిండియా ఆట చూసేందుకు ఇక్కడి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 

కాగా, ఈ మ్యాచ్ కోసం రిషబ్ పంత్, అర్షదీప్ సింగ్ లకు జట్టులో స్థానం కల్పించినట్టు టీమిండియా సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. బుమ్రా, చహల్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదని, వారి బదులు దీపక్ చహర్, రవిచంద్రన్ అశ్విన్ లను తుదిజట్టులోకి తీసుకున్నామని వివరించాడు.

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా...
టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రూసో, ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీ.
Team India
Toss
South Africa
1st T20
Tiruvananthapuram

More Telugu News