Migrants: మధ్యధరా సముద్రంలో పడవ మునక... 77 మంది వలసదారుల జలసమాధి

77 Migrants died after boat drowned near Syria coast

  • లెబనాన్ లో తీవ్ర సంక్షోభం
  • వలసబాట పడుతున్న ప్రజలు
  • అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు పయనం
  • 150 మందితో సిరియా బయల్దేరిన పడవ
  • సిరియా తీరానికి చేరువలో మునక

మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం సిరియా వలసపోతున్న వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. 

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లెబనాన్ నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు ఓ పడవలో సిరియాకు అక్రమ మార్గంలో బయల్దేరారు. వారి పడవ సిరియా తీరానికి చేరువలోకి రాగానే మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది మృతి చెందారు. 

ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో క్రిక్కిరిసిపోయి ఉంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు భావిస్తున్నారు. 

ఘటనపై సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను కాపాడారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మించి ఎక్కువమందిని ఎక్కించడంతో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.

Migrants
Death
Lebanon
Syria
Medeterranian Sea
  • Loading...

More Telugu News