Jogi Ramesh: ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉన్నవాళ్లయితే నాడు చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారు?: మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh asks TDP leaders on NTR Health University name change issue

  • హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు
  • బిల్లు ఆమోదించిన అసెంబ్లీ 
  • మండిపడిన టీడీపీ సభ్యులు
  • వైఎస్సార్ పేరు పెట్టడాన్ని సమర్థించుకున్న జోగి రమేశ్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ సమర్థించుకున్నారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి వైఎస్సార్ అని, వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు. 

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఆరోగ్య భరోసాను అందిస్తే, 108 సర్వీస్ ద్వారా వేలమంది ప్రాణాలు నిలిచాయని వివరించారు. పేదలకు సేవ చేశాడు కాబట్టే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరుపెడుతున్నామని మంత్రి జోగి రమేశ్ వివరించారు. 

వివాదం సృష్టించడానికి టీడీపీ నేతలు రోజుకొక అంశాన్ని ఎంచుకుంటారని, ఇవాళ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుపైనా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే నాడు చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారని టీడీపీ నేతలను నిలదీశారు. 

పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని జోగి రమేశ్ విమర్శించారు. కానీ సీఎం జగన్ కు ఎన్టీఆర్ పై నిజమైన ప్రేమ ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Jogi Ramesh
NTR Health University
Name
YSR
NTR
YSRCP
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News