Allu Arjun: ముద్దుల కుమార్తె చేతిలో ఓడిపోయిన బన్నీ... వీడియో ఇదిగో!

Allu Arjun lost to his daughter for fun

  • కుమార్తెతో అల్లు అర్జున్ సరదా క్షణాలు
  • తనయ కోసం తప్పులు చెప్పిన బన్నీ
  • వీడియో వైరల్

టాలీవుడ్ లో పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా పేరొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ విరామం దొరికితే పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తాడు. తన పిల్లలు అర్హ, అయాన్ లతో గడపడం అంటే బన్నీకి చాలా ఇష్టం. తాజాగా, అర్హతో సరదాగా గడిపారు. 

ఈ సందర్భంగా... "గంగిగోవు పాలు గరిటెడైనను చాలు... అదేంటో చెప్పు" అంటూ అర్హ ప్రశ్నించింది. అందుకు కాసేపు ఆలోచించిన బన్నీ 'జున్ను' అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత నాలుక తిరగని రీతిలో "ఏడు నల్ల లారీలు, ఏడు తెల్ల లారీలు" అని స్పీడుగా చెప్పాలని అర్హ కోరింది. అయితే బన్నీ మొదట్లోనే తప్పు చెప్పేయడంతో ఈ పోటీలో అర్హనే గెలిచింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బన్నీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Allu Arjun
Arha
Fun Contest
Tollywood
  • Loading...

More Telugu News