Muslim Couple: తిరుమల వెంకన్నకు భారీ విరాళం అందించిన ముస్లిం దంపతులు

Chennai Muslim couple donates huge amount to Tirumala Venkateswara Swamy
  • తిరుమల విచ్చేసిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ
  • శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన చెన్నై దంపతులు 
  • విరాళం చెక్కు ఈవో ధర్మారెడ్డికి అందజేత
సప్తగిరుల పైన కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామికి కానుకలకు కొదవలేదు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోరినకోర్కెలు తీర్చే కోనేటిరాయుడికి నిత్యం కోట్లలో ఆదాయం వస్తుంటుంది. అంతేకాదు, భారీ విరాళాలు ఆయన ఖాతాలో చేరుతుంటాయి. తాజాగా, చెన్నైకి చెందిన దంపతులు స్వామివారికి రూ.1.02 కోట్ల భారీ విరాళం అందించారు. 

విశేషం ఏంటంటే... ఆ దంపతులు ముస్లింలు. వారి పేర్లు సుబీనా బాను, అబ్దుల్ ఘనీ. తిరుమలకు విచ్చేసిన ఈ ముస్లిం దంపతులు విరాళం తాలూకు చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. 

తమ విరాళంలో రూ.87 లక్షలను ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు, మిగతా రూ.15 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఇచ్చారు.
Muslim Couple
Chennai
Tirumala
Donation
TTD

More Telugu News