Gujarat: ఎనిమిదేళ్ల కాపురం తర్వాత.. తన భర్త 'స్త్రీ' అని తెలుసుకున్న భార్య!

8 years after marriage wife finds out that husband was earlier a woman

  • 2014లో విజయ్ వర్ధన్‌ను పెళ్లాడిన మహిళ
  • సన్నిహితంగా మెలగకపోవడంతో అనుమానం
  • ఆరా తీస్తే ప్రమాదం జరిగిందని నమ్మబలికే యత్నం
  • ఆ తర్వాత కోల్‌కతా వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వైనం

ఎనిమిది సంవత్సరాల కాపురం తర్వాత తన భర్త గతంలో అమ్మాయన్న విషయం భార్యకు తెలిస్తే? గుజరాత్‌లోని వడోదరలో అదే జరిగింది. విషయం తెలిసిన ఆమె షాక్ నుంచి కోలుకునేందుకు చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులపైనా ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వడోదరకు చెందిన 40 ఏళ్ల మహిళ 2014లో విరాజ్ వర్ధన్‌ను పెళ్లి చేసుకుంది.  

గతంలో విజైత అనే యువతిగా ఉన్న విజయ్ వర్ధన్‌తో ఓ మాట్రిమోనియల్ సైట్ ద్వారా బాధిత మహిళకు పరిచయం ఏర్పడింది. బాధిత మహిళ తొలి భర్త 2011లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీరికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ తర్వాత 2014లో విజయ్ వర్ధన్‌ను పెళ్లి చేసుకుంది. 

అనంతరం హనీమూన్ కోసం ఇద్దరూ కలిసి కశ్మీర్‌ వెళ్లారు. అయితే, విజయ్ వర్ధన్‌ ఆమెతో సన్నిహితంగా మెలగలేకపోయాడు. ప్రతిసారీ ఇదేతంతు కావడంతో ఏం జరిగిందని బాధితురాలు ఆరా తీయడంతో సాకులు చెప్పాడు. తాను రష్యాలో ఉన్నప్పుడు కొన్నేళ్ల క్రితం ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి శృంగారానికి పనికిరాకుండా పోయానని చెప్పాడు. అయితే, ఆ తర్వాత జరిగిన చిన్నపాటి సర్జరీ తర్వాత అంతా సర్దుకుందని నమ్మబలికాడు. 

జనవరి 2020లో బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నానని చెప్పి ఆపరేషన్ కోసం కోల్‌కతా వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చాక అసలు నిజం చెప్పాడు. లింగమార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడిగా మారినట్టు చెప్పాడు. అంతకుమించి అతడు తనకింకేమీ చెప్పలేదని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అతడు తనతో అసహజ శృంగారం చేసేవాడని, తన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీకి చెందిన నిందితుడిని వడోదర తీసుకొచ్చినట్టు చెప్పారు.

Gujarat
Marriage
Vadodara
Woman
Husband
  • Loading...

More Telugu News