Vinesh Phogat: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం నెగ్గి.. రికార్డు సృష్టించిన వినేశ్ ఫొగాట్

Vinesh Phogat wins bronze in Vinesh Phogat wins bronze medal in World Wrestling Championships
  • బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్స్ చాంపియన్‌షిప్స్
  • కాంస్య పతక పోరులో స్వీడన్ క్రీడాకారిణిపై అద్వితీయ విజయం
  • అంతకుముందు 2019లో తొలి పతకం
భారత స్టార్ రెజ్లర్, కామన్వెల్త్ 2022 స్వర్ణ పతక విజేత వినేశ్ ఫొగాట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ తరపున రెండు కాంస్యాలు నెగ్గిన తొలి రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. బెల్‌గ్రేడ్‌లో జరుగుతున్న పోటీల్లో 53 కేజీల విభాగంలో స్వీడన్‌కు చెందిన ఎమ్మా జొనాతో తలపడిన వినేశ్ 8-0తో విజయం సాధించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 

ప్రపంచ చాంపియన్ షిప్స్‌లో ఆమెకు ఇది రెండో పతకం. అంతకుముందు 2019లో కజఖిస్థాన్ లో జరిగిన పోటీల్లో తొలిసారి కాంస్యం గెలుచుకుంది. కాగా, వినేశ్ ఫొగాట్ కామన్వెల్త్ క్రీడల్లో మూడు స్వర్ణాలు సాధించింది.
Vinesh Phogat
World Wrestling Championships
India

More Telugu News