Team India: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రాబిన్ ఊతప్ప వీడ్కోలు

Robin Uthappa retires from all formats of cricket

  • అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఊత‌ప్ప‌
  • టీమిండియాకు 46 వ‌న్డేలు, 12 టీ20 ఆడిన క‌ర్ణాట‌క క్రికెట‌ర్‌
  • ఐపీఎల్‌లో ఏకంగా 5 జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించిన వైనం

భార‌త క్రికెట‌ర్ రాబిన్ ఊత‌ప్ప అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ మేర‌కు బుధ‌వారం సాయంత్రం అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌కటిస్తూ ఊత‌ప్ప ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. టీ20, వ‌న్డే, టెస్టు క్రికెట్‌ల‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో ఊత‌ప్ప పేర్కొన్నాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో స‌త్తా చాటిన ఈ క‌ర్ణాట‌క క్రికెట‌ర్‌... భార‌త జ‌ట్టులో స్థానాన్ని ప‌దిల‌ప‌ర‌చుకునే విష‌యంలో మాత్రం త‌డబ‌డ్డాడు. 

బ్యాట‌ర్‌గానే కాకుండా వికెట్ కీప‌ర్‌గా, స‌త్తా క‌లిగిన ఫీల్డ‌ర్‌గా, బౌల‌ర్‌గానూ మంచి ప్రావీణ్యం ఉన్న ఊత‌ప్ప‌.. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 46 వ‌న్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో త‌న‌దైన శైలి ప్ర‌తిభ చాటిన ఊత‌ప్ప... ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పూణే వారియ‌ర్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల‌కు ఆడాడు.

Team India
Cricket
IPL
Robin Uthappa
  • Loading...

More Telugu News