Ayyanna Patrudu: విజయసాయిరెడ్డి ఎంత దోచుకున్నారనే దానిపై చర్చకు మేము సిద్ధం: అయ్యన్నపాత్రుడు

Vijayasai Reddy looted Rs 10000 Cr says Ayyanna patrudu

  • ఆంధ్ర యూనివర్శిటీని వైసీపీ నేతలు బ్రోతల్ హౌస్ లా మార్చారన్న అయ్యన్న 
  • వీసీ ఛాంబర్ ను వైసీపీ కార్యాలయంలా మార్చారని వ్యాఖ్య 
  • విజయసాయి రూ. 10 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపణ 

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. హుదూద్ తుపాను సమయంలో చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అందరూ చూశారని చెప్పారు. వైసీపీ నేతలు ఆంధ్ర యూనివర్శిటీని బ్రోతల్ హౌస్ గా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీ వీసీ ఛాంబర్ ను వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. 

ఏ2 విజయసాయిరెడ్డి రూ. 10 వేల కోట్ల ఆస్తులను దోచుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా విజయసాయి ఉన్నప్పుడు ఎంత దోచుకున్నారో చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పారు. ఇలాంటి దోపిడీదారులా మాకు నీతులు చెప్పేదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రం దెబ్బతింటోందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. గతంలో అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పిన జగన్... ఇప్పుడు మళ్లీ మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు.

Ayyanna Patrudu
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
YSRCP
  • Loading...

More Telugu News