Sharwanand: బన్నీ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను: 'ఒకే ఒక జీవితం' డైరెక్టర్ శ్రీ కార్తీక్

Sri Karthik Interview

  • ఈ నెల 9న వచ్చిన 'ఒకే ఒక జీవితం'
  • చాలా కాలం తరువాత శర్వానంద్ కి లభించిన హిట్ 
  • దర్శకుడిగా శ్రీ కార్తీక్ కి గుర్తింపు 
  • బన్నీని లైన్లో పెట్టే ప్రయత్నం

తెలుగు తెరకి కొత్తగా పరిచయమైన దర్శకుడు శ్రీకార్తీక్. శర్వానంద్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'ఒకే ఒక జీవితం' ఈ నెల 9వ తేదీన ప్రేక్షకులను పలకరించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు యూఎస్ లోను చాలా తక్కువ వసూళ్లతో మొదలైన ఈ సినిమా, ప్రస్తుతం మౌత్ టాక్ తో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.

ఒక వైపున మదర్ సెంటిమెంట్ .. మరో వైపున టైమ్ ట్రావెల్ నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా, దర్శకుడిగా శ్రీకార్తీక్ కి మంచి పేరును తీసుకుని వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'ఒకే ఒక జీవితం' ఇచ్చిన సక్సెస్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. దర్శకుడిగా మరింత ముందుకు వెళ్లడానికి అవసరమైన ఎనర్జీని ఇచ్చింది" అన్నాడు. 

మా ఇంట్లో నాతో పాటు అందరూ కూడా అల్లు అర్జున్ గారిని అభిమానిస్తాం. ఆయనతో తప్పకుండా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. శ్రీకార్తీక్ మాటలు వింటుంటే, అల్లు అర్జున్ కోసం ఏదో కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు అనిపిస్తోంది!

Sharwanand
Ritu Varma
Amala
Sri Karthik
Oke Oka Jeevitham
  • Loading...

More Telugu News