Ponguleti: రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు: పార్టీ మార్పుపై పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

Pongulati comments on party change

  • ప్రస్తుతం తాను టీఆర్ఎస్ లోనే ఉన్నానన్న పొంగులేటి
  • వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని వెల్లడి
  • వైసీపీని వీడినట్టే భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని వ్యాఖ్య

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను తప్పని సరిగా పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతానికైతే తాను అధికార పార్టీలోనే ఉన్నానని... వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే బరిలోకి దిగుతానని అన్నారు. అయితే, వివిధ పరిస్థితుల కారణంగా రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తొలుత తాను వైసీపీ నుంచి పోటీ చేస్తే ప్రజలు దీవించారని... తాను పార్టీ మారుతానని ఎప్పుడూ అనుకోలేదని పొంగులేటి చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే వైసీపీని వీడాల్సి వచ్చిందని అన్నారు. ఇదే మాదిరి భవిష్యత్తులో కూడా ఏదైనా జరగొచ్చని చెప్పారు. మధిరలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు పిడమర్తి రవి, బొమ్మెర రామ్మూర్తి, వెంకటేశ్వరరెడ్డి ఆయనతో పాటు ఉన్నారు.

Ponguleti
TRS
Khammam
YSRCP
  • Loading...

More Telugu News