Nani: నానీ .. శర్వానంద్ తో హను రాఘవపూడి మల్టీ స్టారర్!

Hanu Raghvapudi new movie update

  • ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా హను రాఘవపూడి 
  • రీసెంట్ హిట్ గా నిలించిన 'సీతా రామం'
  • తరువాత ప్రాజెక్టుపై కసరత్తు
  • ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ

టాలీవుడ్ దర్శకులలో హను రాఘవపూడికి ఒక ప్రత్యేకమైన స్టయిల్ ఉంది. ప్రేమకథలను ఫీల్ తో తెరకెక్కించడంలో ఆయనకి మంచి నైపుణ్యం ఉంది. తనపై మణిరత్నం ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకునే హను రాఘవపూడి నుంచి ఇటీవల సీతా రామం' సినిమా వచ్చింది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రానికి విశేషమైన ఆదరణ లభించింది.  

అలాంటి హను రాఘవపూడి తన తదుపరి సినిమాను మల్టీ స్టారర్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్రలకిగాను నానీ .. శర్వానంద్ లను తీసుకోనున్నాడని అంటున్నారు. హిందూ ... ముస్లిమ్ యువకులుగా వాళ్లని చూపించనున్నాడని చెబుతున్నారు. 

నానీ .. శర్వానంద్ లతో హను రాఘవపూడికి మంచి సాన్నిహిత్యం ఉంది. నానితో ఆయన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' ..  శర్వాతో 'పడి పడి లేచే మనసు' చేశాడు. ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ చేయడానికి ఒక బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.

Nani
Sharwanand
Hanu raghavapudi
  • Loading...

More Telugu News