Marakatha Sri Lakshmi Ganapathi: గణేశుడి లడ్డూ వేలంలో ఆల్‌టైం రికార్డు!.. రూ.46 ల‌క్ష‌లు ప‌లికిన అల్వాల్ వినాయ‌కుడి ల‌డ్డూ!

all time record rate for Marakatha Sri Lakshmi Ganapathi laddu

  • అల్వాల్ క‌నాజీగూడ‌ మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ల‌డ్డూ వేలం
  • మ‌ర‌క‌త వినాయ‌కుడి ల‌డ్డూ కోసం హోరాహోరీగా సాగిన వేలం
  • రూ.45,99,999లకు ద‌క్కించుకున్న వెంక‌ట్ రావు
  • తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌కుడి ల‌డ్డూ వేలం ధ‌ర‌ల్లో ఇదే అత్య‌ధికం

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఏర్పాటు చేస్తున్న గ‌ణేశుడికి ప్ర‌సాదంగా స‌మ‌ర్పిస్తున్న ల‌డ్డూ వేలం పాట‌ల‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు న‌మోదు అవుతున్నాయి. ఏటికేడు ల‌డ్డూ వేలం పాట‌లు పెరిగిపోతుండ‌గా... ఆయా వేలం పాటల్లో భ‌క్తులు వెచ్చిస్తున్న మొత్తం కూడా పెరిగిపోతోంది. ఈ వేలం పాట‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టిదాకా న‌మోదైన వేలం పాట‌ల‌న్నింటినీ మించి... గ‌ణేశుడి ల‌డ్డూ వేలం పాట‌ల్లో ఆల్‌టైం రికార్డుగా శ‌నివారం నాటి వేలం పాట న‌మోదైంది. గ‌ణేశుడి ల‌డ్డూను వేలంలో ఓ భ‌క్తుడు ఏకంగా రూ.45,99,999లు వెచ్చించి మ‌రీ ద‌క్కించుకున్నాడు.

హైద‌రాబాద్ ప‌రిధిలోని అల్వాల్ ప‌రిధిలోని క‌నాజీగూడ మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణప‌తి ఆల‌యంలో ఇటీవ‌లి కాలంలో భారీ గ‌ణేశుడి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో ల‌డ్డూ వేలం పాటలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్ర‌మంలో శ‌నివారం జ‌రిగిన అల్వాల్ క‌నాజీగూడ మ‌ర‌క‌త వినాయ‌కుడి ల‌డ్డూ వేలం పాట జ‌ర‌గ‌గా... వెంక‌ట్ రావు అనే భ‌క్తుడు రూ.45,99,999ల‌కు గ‌ణేశుడి లడ్డూను ద‌క్కించుకున్నాడు. అంటే.. రూ.1 త‌క్కువ రూ.46 ల‌క్ష‌ల‌కు ఆయ‌న వినాయ‌కుడి ల‌డ్డూను ద‌క్కించుకున్నాడ‌న్న మాట‌. ఈ ధ‌ర ఇప్ప‌టిదాకా తెలుగు రాష్ట్రాల్లో న‌మోదైన అన్ని వేలం పాట‌ల్లోకెల్లా అత్య‌ధిక ధ‌ర ప‌లికిన‌దిగా రికార్డుల‌కెక్కింది.

Marakatha Sri Lakshmi Ganapathi
Hyderabad
Vinayaka Chavithi
Alwal
  • Loading...

More Telugu News