Sharwanand: శర్వా నన్ను మైకులో తిట్టేసి .. మైకు పక్కకి పెట్టి లవ్ యూ డాళింగ్ అన్నాడు: వెన్నెల కిశోర్

Oke Oka Jeevitham movie thank you meet

  • నిన్ననే విడుదలైన 'ఒకే ఒక జీవితం'
  • శ్రీను పాత్రలో నవ్వించిన వెన్నెల కిశోర్
  • కొంత సేపటి క్రితం జరిగిన 'థ్యాంక్యూ మీట్'
  • శర్వా తిట్టడం పై స్పందించిన కిశోర్  

మొన్న 'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్నెల కిశోర్ రాకపోతే, శర్వానంద్ సరదాగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంతసేపటి క్రితం జరిగిన ఈ సినిమా 'థ్యాంక్యూ మీట్' కి వెన్నెల కిశోర్ కూడా వచ్చాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వా మాటలను గురించి ప్రస్తావించాడు.

"శర్వా గారు మొన్న చెప్పినట్టు ఈ సినిమా ఇప్పించింది ఆయనే. నేను ఎందుకు ఫంక్షన్ కి రాలేదనేది శర్వాకి తెలుసు. అయినా సార్ పెద్ద డైలాగులు కొట్టాడు. ఇప్పుడు ప్రియదర్శి రాలేదు. ఆయనను కూడా అలాగే తిట్టకాపోతే నేను ఫీలవుతా. యూ ట్యూబ్ లో హెడ్డింగ్స్ చూసి .. మా ఫ్రెండ్స్ అంతా ఏమైందని అడుగుతున్నారు. ఎందుకు శర్వా అలా అరిచేశాడు అని అంటున్నారు.

'అరేయ్ కిశోర్ ఈ సినిమా నేను ఇప్పించా .. నువ్వు ప్రమోషన్ కి రాలేదు .. నీ సంగతి చెబుతా' అని శర్వా మైకులో తిట్టేసి, మైకు పక్కకి పెట్టుకుని 'లవ్ యూ డాళింగ్' అన్నాడు. అది ఎవరికి వినపడుతుంది?" అంటూ నవ్వేశాడు. వెన్నెల కిశోర్ నవ్వుతూ మాట్లాడినా, శర్వా మాటలకు ఆయన కాస్త ఫీల్ అయినట్టుగానే కనిపించింది మరి.

Sharwanand
Ritu Varma
Vennela Kishore
Oke Oka Jeevitham Movie
  • Loading...

More Telugu News