Sharwanand: హిట్ లేకపోతే ఎలా ఉంటుందనేది మీకు తెలుసు: 'ఒకే ఒక జీవితం' థ్యాంక్యూ మీట్ లో శర్వా!

Oke Oka Jeevitham movie thank you meet

  • నిన్ననే విడుదలైన 'ఒకే ఒక జీవితం'
  •  కొంతసేపటి క్రితం జరిగిన 'థ్యాంక్యూ మీట్'
  • రెస్పాన్స్ బాగుందంటూ శర్వా ఆనందం  
  • అమలగారు వరుస సినిమాలు చేయాలంటూ రిక్వెస్ట్


శర్వానంద్ హీరోగా రూపొందిన 'ఒకే ఒక జీవితం' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్ జోడీగా రీతూ వర్మ కనిపించగా, ఇతర ముఖ్యమైన పాత్రలను అమల అక్కినేని .. వెన్నెల కిశోర్.. ప్రియదర్శి పోషించారు. 

ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, 'థ్యాంక్యూ మీట్' ను ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ పై శర్వానంద్ మాట్లాడుతూ .. "ఈ సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నాలుగైదేళ్లుగా నాకు హిట్ లేదు .. హిట్ లేకపోతే ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. థియేటర్స్ లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూశాక హమ్మయ్య అనుకున్నాను. 

నా చుట్టు పక్కనున్న వాళ్లంతా ఈ సారి నేను సక్సెస్ కొట్టాలని అనుకున్నారు .. అక్కడే నేను సక్సెస్ అయ్యాను. శ్రీకార్తీక్ ఇలాంటి కథలు ఎప్పుడు రాసినా చేయడానికి రెడీగా ఉన్నాము. అమలగారి పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇకపై ఆమె వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

Sharwanand
Rutu Varma
Oke Oka Jeevitham Movie
  • Loading...

More Telugu News