Balapur Laddu: రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షల ధర పలికిన బాలాపూర్ లడ్డూ... సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి

Lakshma Reddy grabbed Balapur Laddu for record price in auction

  • హోరాహోరీగా బాలాపూర్ లడ్డూ వేలం
  • ఉత్సవ కమిటీ సభ్యుడికే లడ్డూ సొంతం
  • ఘనంగా సన్మానించిన ఇతర సభ్యులు
  • వచ్చే ఏడాది డబ్బు చెల్లించనున్న లక్ష్మారెడ్డి
  • బాండ్ పేపర్ పై సంతకం

బాలాపూర్ గణేశ్ లడ్డూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. గతేడాది ధరను మించిపోయి ఈసారి రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షల ధర పలికింది. వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గ్రామం సెంటర్లోని బొడ్రాయి వద్ద ఈ వేలం నిర్వహించారు. లడ్డూను సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి బాలాపూర్ గణేశ్ మండపం నిర్వాహకులు లడ్డూను అందించారు. ఆయనకు శాలువాను కప్పి సన్మానం చేశారు. 

వంగేటి లక్ష్మారెడ్డి ఇక్కడి గణేశ్ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ప్రస్తుతం లడ్డూను కొనుగోలు చేసిన మేరకు ఆ డబ్బును వచ్చే ఏడాది ఇదే రోజున చెల్లిస్తానంటూ ఆయన అందరి సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం చేశారు.

Balapur Laddu
Lakshma Reddy
Auction
Record Price
Hyderabad
Vinayaka Chavithi
Telangana
  • Loading...

More Telugu News