Telangana: వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్బంగా తెలంగాణ‌లో రేపు పాఠ‌శాల‌ల‌కు సెల‌వు

tomorrow is a goliday for schools in telangana due to vinayaka idols immersion

  • రేపే జంట న‌గ‌రాల్లో వినాయ‌క నిమ‌జ్జ‌నం
  • హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌ల్కాజిగిరీ జిల్లాల్లో రేపు సెల‌వు
  • న‌వంబ‌ర్ 12న ప‌ని దినంగా ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్ర‌భుత్వం

వినాయ‌క నిమజ్జ‌నాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో రేపు (శుక్ర‌వారం) పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌కటిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌ల్కాజిగిరీ జిల్లాల్లోని పాఠ‌శాల‌ల‌కు శుక్ర‌వారం సెల‌వు దినంగా ప్ర‌క‌టించింది. రేప‌టి ప‌ని దినాన్ని భ‌ర్తీ చేస్తూ న‌వంబ‌ర్‌ 12న సెల‌వు దినాన్ని ప‌ని దినంగా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు రేప‌టి ప‌ని దినాన్ని భ‌ర్తీ చేస్తూ ఎల్లుండి (రెండో శ‌నివారం) త‌ర‌గ‌తులు నిర్వ‌హించేలా ప‌లు పాఠ‌శాల‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి.

Telangana
TRS
Vinayaka Chavithi
Ganesh idols immersion
Ranga Reddy District
Hyderabad District
Medchal Malkajgiri District
  • Loading...

More Telugu News