Arshdeep Singh: విమర్శల పాలవుతున్న అర్షదీప్ కు సచిన్ టెండూల్కర్ మద్దతు

Sachin Tendulker came into support for young bowler Arshdeep Singh

  • ఆసియాకప్ సూపర్-4లో పాక్ చేతిలో భారత్ ఓటమి
  • కీలక దశలో క్యాచ్ వదిలిన అర్షదీప్
  • అర్షదీప్ పై విమర్శకుల దాడి
  • అవేవీ పట్టించుకోవద్దన్న సచిన్
  • బాగా ఆడడం ద్వారా బదులివ్వాలని పిలుపు

ఆసియాకప్ సూపర్-4 దశలో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోయాక యువ బౌలర్ అర్షదీప్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. క్యాచ్ వదిలి భారత్ ఓటమికి కారకుడయ్యాడంటూ విమర్శకులు అర్షదీప్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆ యువ బౌలర్ కు మద్దతుగా స్పందించాడు. 

"దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రీడాకారుడు దేశం కోసం ఆడుతూ ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి మనం నిరంతరం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. క్రీడలలో కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు గెలుస్తాం. క్రికెట్ కానీ, మరే ఇతర క్రీడను గానీ వ్యక్తిగత విమర్శల బారిన పడకుండా కాపాడుకోవాలి. మైదానంలో అత్యుత్తమంగా రాణించి విమర్శలకు జవాబివ్వాలి. అర్షదీప్... నీ ఆటను నేను గమనిస్తూనే ఉంటాను. నీకు నా శుభాకాంక్షలు" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

Arshdeep Singh
Sachin Tendulkar
Team India
Pakistan
  • Loading...

More Telugu News