Realme C33: తక్కువ ధరకే రియల్ మీ సీ33 విడుదల

Realme C33 launched in India at a starting price of Rs 8999
షార్ట్స్‌లో చూడండి
రియల్ మీ తక్కువ ధరకే సీ33 4జీ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధరలు రూ.8,999 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల డిస్ ప్లే, యూనిసాక్ టీ612 ప్రాసెసర్ ఉన్నాయి. 3జీబీ, 32జీబీ, 4జీబీ, 64జీబీ వెర్షన్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా వున్నాయి. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా వున్నాయి. ఇంటర్నల్ స్టోరేజీని ఒక టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. 

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జర్ తో వస్తుంది. ఈ ఫోన్ 8.3 ఎంఎం మందంతో, 187 గ్రాముల బరువు ఉంటుంది. 3జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ.8.999. 4జీబీ ర్యామ్ ధర రూ.9,999. ఆక్వా బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ పై విక్రయాలు జరగనున్నాయి. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డుపై కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.
Go Back to Shorts
Realme C33
4g phone
launched
Rs 8999

More Telugu News