Sharwanand: 'ఒకే ఒక జీవితం' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వేదిక ఎక్కడంటే!

  • శర్వానంద్ తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం' 
  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ 
  • కీలకమైన పాత్రలో అమల అక్కినేని 
  • ఈనెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా   
Oke Oka Jeevitam Movie Update

శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు హైదరాబాదు .. జేఆర్సీ కన్వెన్షన్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. భారీ స్థాయిలోనే ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. 

ఇది కేవలం మదర్ సెంటిమెంట్ కి సంబంధించిన సినిమా అని మొన్నటివరకూ అనుకున్నారు. ఆ సెంటిమెంట్ అనేది టైమ్ ట్రావెల్ తో ముడిపడి ఉంటుందంటూ సినిమాపై అంచనాలు పెంచారు. వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరవుతున్న శర్వానంద్ కి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News