బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టితో అమిత్ షా భేటీ... ఫొటో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టితో అమిత్ షా భేటీ... ఫొటో ఇదిగో

amit shah meets bollywood director Rohit Shettyin mumbai
  • ఇటీవ‌లే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన అమిత్ షా
  • తాజాగా ముంబైలో శెట్టితో భేటీ
  • ఈ భేటీపై పోస్ట్ పెట్టిన కేంద్ర హోం మంత్రి  
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌తో భేటీ అవుతున్న వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇటీవ‌లే తెలంగాణ పర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా... టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సోమ‌వారం ముంబై వెళ్లిన అమిత్ షా... బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టితో భేటీ అయ్యారు. ఈ విష‌యాన్ని అమిత్ షానే స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల వేదిక‌గా ఫొటో స‌హా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

2003లో బాలీవుడ్‌లో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి... వ‌రుస‌బెట్టి హిట్ చిత్రాల‌ను అందించారు. అజయ్ దేవ్‌గ‌ణ్ తో త‌న తొలి చిత్రం జ‌మీన్‌ను తెర‌కెక్కించిన శెట్టి... ఆ త‌ర్వాత కామెడీ ప్ర‌ధానంగా సాగిన గోల్ మాల్ సిరీస్‌ను మొద‌లుపెట్టారు. మ‌ధ్య‌లో స‌న్‌డే, ఆల్ ద బెస్ట్ ఫ‌న్ బిగిన్స్ వంటి చిత్రాల‌ను తీసిన శెట్టి... గోల్ మాల్ సిరీస్‌లోనే 4 సినిమాల‌ను తెర‌కెక్కించారు. వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ రంగంలోనూ శెట్టి రాణిస్తున్నారు. ఏమాత్రం రాజ‌కీయ నేప‌థ్యం లేని శెట్టిని అమిత్ షా క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
BJP
Amit Shah
Rohit Shetty
Bollywood
Jr NTR
Mumbai

More Telugu News