Kili Paul: కాలా చష్మా పాటకు కిలీపాల్ స్టెప్స్

Kili Paul and sister Neema groove to Kala Chashma in new viral video

  • సోదరి నీమాపాల్ తో కలసి నృత్యం
  • ఇన్ స్టా గ్రామ్ లో వీడియో షేర్
  • మూడు లక్షలకు పైగా లైక్స్

ఆమధ్య వచ్చిన బార్ బార్ దేఖో సినిమాలోని కాలా చష్మా పాట ఇప్పటికీ చాలా మందిని ఊత్సాహంగా ఊగించేస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు. ఈ క్రమంలో టాంజానియాకు చెందిన కిలీపాల్, తన సోదరి నీమాపాల్ తో కలసి స్టెప్స్ వేశాడు. ఈ అన్నా చెల్లెళ్లు భారతీయ పాటలకు నృత్యాలు చేయడం ద్వారా పాప్యులర్ అవ్వడం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ కు సైతం లోగడ స్టెప్స్ వేశారు.

కాలా చష్మా సాంగ్ కు నృత్యం చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నెట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో కిలీపాల్ కూడా తన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షలకు పైగా చూడగా, 3 లక్షల మందికి పైగా లైక్ కొట్టేశారు. కిలీపాల్, నీమా పాల్ ను ప్రధాని మోదీ సైతం లోగడ ప్రశంసించడం తెలిసిందే. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)

Kili Paul
Neema paul
Kala Chashma
song
dance
instagram
  • Loading...

More Telugu News