Surekha Vani: పవన్ పై ప్రేమ కురిపించిన సురేఖావాణి.. పాత ఇంటర్వ్యూ వైరల్

I will give 100 kisses to Pawan Kalyan says Surekha Vani

  • మెగా కుటుంబంపై అభిమానాన్ని చాటుకున్న సురేఖ
  • చిరంజీవికి పెద్ద అభిమానినని చెప్పిన నటి 
  • పవన్ కనపడితే ముద్దులతో ముంచెత్తుతానని వెల్లడి 

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖావాణికి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. నటనతోనే కాకుండా తన అందంతో సైతం ప్రేక్షకులను కట్టిపడేసే సురేఖకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సురేఖకు చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మెగా కుటుంబంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. 

మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానినని చెప్పింది. జనసేనాని పవన్ కల్యాణ్ అంటే ఎంత తనకు ఎంత ప్రేమో వెల్లడించింది. పవన్ తన ముందు కనపడితే ముద్దులతో ముంచెత్తుతానని, వంద ముద్దులు పెడతానని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

మరోవైపు, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రెండో పెళ్లికి తాను దూరమని చెప్పింది. అయితే, తనకు బోయ్ ఫ్రెండ్ మాత్రం కావాలని తెలిపింది. అంతేకాదు బోయ్ ఫ్రెండ్ కు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా తెలిపింది.

Surekha Vani
Chiranjeevi
Pawan Kalyan
Tollywood
Janasena
  • Loading...

More Telugu News