Mahesh Babu: తనయుడికి మహేశ్ బాబు అందించిన పుట్టినరోజు సందేశం చూశారా...!

Mahesh Babu special birtdhay message to son Goutham

  • నేడు ఘట్టమనేని గౌతమ్ పుట్టినరోజు
  • పదహారేళ్ల ప్రాయంలోకి మహేశ్ బాబు తనయుడు
  • ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెన్నంటే ఉంటానని మహేశ్ ట్వీట్
  • ఊహించనంతగా ప్రేమిస్తూనే ఉంటానని వెల్లడి

మహేశ్ బాబు తనయుడు గౌతమ్ నేడు 16వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. గౌతమ్ పదహారేళ్ల ప్రాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మహేశ్ బాబు ఓ తండ్రిగా ఆకట్టుకునే సందేశం అందించారు. "హ్యాపీ 16 మై యంగ్ మ్యాన్" అంటూ ట్వీట్ చేశారు. 

"నువ్వు నానాటికీ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. ఉన్నత విలువలతో కూడిన సొంత వ్యక్తిత్వంతో నువ్వు ఎదిగే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను. జీవిత ప్రస్థానంలోని ఈ కొత్త దశలో నీకు నా ప్రేమాభిమానాలు, దీవెనలు తప్పక ఉంటాయి. ఒక విషయం మర్చిపోవద్దు... నా అవసరం ఉందని నువ్వు భావించిన ప్రతిసారీ నీవెంటే ఉంటాను. లవ్యూ గౌతమ్... నువ్వు ఊహించనంతగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అంటూ మహేశ్ బాబు భావోద్వేగాలతో స్పందించారు.

Mahesh Babu
Goutham
Bithday
Special Message
Tollywood
  • Loading...

More Telugu News