Hero Ajith: క్రూయిజర్ బైకుపై వైజాగ్ నుంచి హిమాలయాలకు వెళ్లిన హీరో అజిత్

Hero Ajith tours Himalayas from Vizag after shooting completed

  • వైజాగ్ లో అజిత్ కొత్త చిత్రం షూటింగ్
  • షూటింగ్ పూర్తికాగానే ఫ్రెండ్స్ తో కలిసి బైక్ టూర్
  • తొలుత లడఖ్ చేరుకున్న అజిత్ గ్రూప్
  • వారం రోజులు హిమాలయాల్లోనే గడపనున్న వైనం

ప్రముఖ దక్షిణాది హీరో అజిత్ కు బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ చిత్రంలో స్వయంగా బైక్ తో స్టంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా బైక్ తో లాంగ్ రైడ్లు వెళుతుంటారు. 

తాజాగా, ఆయన వైజాగ్ నుంచి హిమాలయాలకు తన క్రూయిజర్ బైక్ పై వెళ్లారు. అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో పూర్తయింది. అయితే ఆయన చెన్నై వెళ్లకుండా, విశాఖ నుంచే తన ఫ్రెండ్స్ తో కలిసి హిమాలయాలకు పయనమయ్యారు. తొలుత లడఖ్ వెళ్లి, అక్కడ్నించి హిమాలయ పర్వతాలను చేరుకున్నారు. 

కాగా, అజిత్ తో పాటు హిమాలయాలకు టూర్ వెళ్లిన వారిలో పొల్లాచ్చి నగరానికి చెందిన అన్నాడీఎంకే కౌన్సిలర్ సెంథిల్ కూడా ఉన్నారు. వారం పాటు అజిత్, ఆయన మిత్రబృందం హిమాలయాల్లో గడిపి చెన్నై తిరిగిరానున్నారు.
.

Hero Ajith
Bike Riding
Himalayas
Vizag
Kollywood
  • Loading...

More Telugu News