Actor Suman: నటుడు సుమన్ ఇక లేరంటూ యూట్యూబ్ చానళ్లలో వీడియోలు.. పరువునష్టం దావా వేస్తానన్న నటుడు

Actor Suman warns Youtube Channel that publish sumans health

  • సుమన్ మరణించారంటూ యూట్యూబ్ చానళ్లలో వీడియోలు
  • నిజమేనా? అంటూ అభిమానుల ఆరా
  • షూటింగ్ నిమిత్తం బెంగళూరులో ఉన్న సుమన్
  • అవి నిరాధార వార్తలంటూ ఆగ్రహం

ఉత్తరాది యూట్యూబ్ చానళ్లలో తనపై జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. వాటిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆందోళన వద్దన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. సుమన్ మరణించారంటూ ఉత్తరాది యూట్యూబ్ చానళ్లు కొన్ని వీడియోలు పోస్టు చేశాయి. అవి చూసిన తెలుగు సినీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. నిజ నిర్ధారణ చేసుకునేందుకు ఈ వార్తలు నిజమేనా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ప్రస్తుతం ఓ షూటింగ్ నిమిత్తం బెంగళూరులో ఉన్న సుమన్‌కు ఆ విషయం స్నేహితుల ద్వారా తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన.. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన ఆ యూట్యూబ్ చానల్స్ పై పరువునష్టం దావా వేయనున్నట్టు సుమన్ చెప్పారు.

Actor Suman
Tollywood
Youtube
  • Loading...

More Telugu News