Andhra Pradesh: 1.24 ల‌క్ష‌ల మ‌ట్టి గ‌ణేశ ప్ర‌తిమ‌లు పంపిణీ చేస్తున్న చెవిరెడ్డికి ఏసియ‌న్ రికార్డ్ బుక్ అవార్డు... వీడియో ఇదిగో

ysrcp mla chevireddy bhaskar reddy recieves Asian Record Book award
  • ప‌ర్యావ‌ర‌ణ హితాన్ని ఆశిస్తూ చెవిరెడ్డి అడుగు
  • చంద్ర‌గిరి నియోజ‌క‌వర్గంలో ప్ర‌తి ఇంటికి మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ పంపిణీ
  • పంపిణీకి సిద్ధ‌మైన విగ్ర‌హాలు
  • ఏసియ‌న్ రికార్డ్ బుక్ అవార్డును అందుకున్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ నేత‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి ఈ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ పరిధిలోని అన్ని ఇళ్ల‌కు మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను అందించాల‌ని సంక‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం భారీ ఎత్తున ఖ‌ర్చు చేస్తున్న చెవిరెడ్డి మ‌ట్టి గ‌ణేశుల త‌యారీని దాదాపుగా పూర్తి చేశారు. ఈ క్రమంలో చెవిరెడ్డిని ఓ అవార్డు వ‌రించింది.

ప‌ర్యావ‌ర‌ణ హితంగా మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను... అది కూడా 1.24 ల‌క్ష‌ల విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్న చెవిరెడ్డికి ఏసియ‌న్ రికార్డ్ బుక్ ఓ అవార్డును అంద‌జేసింది. ఈ మేర‌కు శ‌నివారం తిరుప‌తిలో ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో ఏసియ‌న్ రికార్డ్ బుక్ ప్ర‌తినిధులు చెవిరెడ్డికి అవార్డును అంద‌జేశారు. ఇదిలా ఉంటే... నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఇంటికి పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన చెవిరెడ్డి మ‌ట్టి వినాయక ప్ర‌తిమ‌లు పంపిణీకి సిద్ధ‌మైపోయాయి. త్వ‌ర‌లోనే వీటి పంపిణీని చెవిరెడ్డి బృందం మొద‌లుపెట్ట‌నుంది.
Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy
YSRCP
Clay Vinayaka Idol
Asian Record Book

More Telugu News