Chandrababu: ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నట్టు ఇక్కడ మనకు జగన్ ఉన్నారు: చంద్రబాబు

Chandrababu describes CM Jagan as North Korea dictator Kim

  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • యానాదిపల్లిలో టీడీపీ అధినేతకు ఘనస్వాగతం
  • ఒకప్పుడు కుప్పంలో కనీస సౌకర్యాలు ఉండేవి కావన్న చంద్రబాబు
  • టీడీపీ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని వెల్లడి

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. యానాదిపల్లిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఒకప్పుడు కుప్పంలో కనీస సౌకర్యాలు ఉండేవి కావని అన్నారు. టీడీపీ హయాంలో కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కుప్పంలో విద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని చెప్పారు. 

ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నట్టు ఇక్కడ మనకు జగన్ ఉన్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. తనను కుప్పం రానివ్వకుండా చేసేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పోలీసులు సైతం నిన్న కుప్పంలో రౌడీల్లా ప్రవర్తించారని చంద్రబాబు అన్నారు. యూనిఫాం లేకుండా వచ్చి దాడులు చేస్తున్నారని వివరించారు. మొన్నటివరకు కుప్పంలో చిన్న గొడవ చేసేందుకు భయపడేవాళ్లు, ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకువచ్చి కుప్పంలో గొడవలు చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Chandrababu
CM Jagan
Kim Jong Un
TDP
YSRCP
Kuppam
Andhra Pradesh
  • Loading...

More Telugu News