IRCTC: రైలులో ప్రయాణిస్తూనే వాట్సాప్ ద్వారా కావాల్సిన ఫుడ్ ఆర్డర్

IRCTC now lets you order food online on train using WhatsApp

  • జూప్ పేరుతో రైళ్లలో ఫుడ్ డెలివరీ సేవను ప్రారంభించిన ఐఆర్సీటీసీ
  • రానున్న స్టేషన్లు, రెస్టారెంట్ల మెనూ చూసి ఆర్డర్ చేయవచ్చు
  • సదరు స్టేషన్ రాగానే ఫుడ్ డెలివరీ

రైలు ప్రయాణం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తూ తమకు కావాల్సిన ఆహారాన్ని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఆర్ సీటీసీకి చెందిన ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘జూప్’ ఇటీవలే జియో హ్యాప్టిక్ తో ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రయాణికులు తమ వాట్సాప్ నుంచి ఫుడ్ కోసం (పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా ) ఆర్డర్ చేసుకోవచ్చు. 

ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ కోసం వేరే ఏ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ సేవను ఐఆర్ సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జూప్ వాట్సాప్ ఖాతా నుంచి కోరుకున్నది ఆర్డర్ చేయవచ్చు. తదుపరి స్టేషన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ అవుతుంది. 

ప్రయాణికులు తమ ఫోన్ లో జూప్ వాట్సాప్ నంబర్ 7042062070 ను సేవ్ చేసుకోవాలి. ఆర్డర్ చేయాలనుకున్నప్పుడు 10 అంకెల పీఎన్ఆర్ నమోదు చేయాలి. పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా ప్రయాణికుడు ఏ కోచ్ లో, ఏ బెర్త్ లో ఉన్నది వారికి తెలుస్తుంది. అనంతరం వచ్చే స్టేషన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని జూప్ చాట్ బోట్ అడుగుతుంది. తర్వాత ఆ స్టేషన్ లోని రెస్టారెంట్లు, వాటిల్లోని ఫుడ్ మెనూను అందిస్తుంది. కావాల్సిన దాన్ని ఆర్డర్ చేసి, అక్కడి నుంచే పేమెంట్ చేయవచ్చు. ప్రయాణికుడు ఎంపిక చేసుకున్న స్టేషన్ రాగానే, ఆర్డర్ డెలివరీ అవుతుంది. ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు ట్రాక్ కూడా చేసుకోవచ్చు.

IRCTC
train
journey
food order
zoop
whatsapp
  • Loading...

More Telugu News