Telugudesam: డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించిన టీడీపీ నేతలు

TDP leaders sat before DGP office

  • కుప్పంలో చంద్రబాబు పర్యటనకు వైసీపీ ఆటంకాలు
  • అచ్చెన్నాయుడు నేతృత్వంలో డీజీపీ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లిన టీడీపీ నేతలు
  • డీజీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన వైనం

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు వైసీపీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ఏపీ డీజీపీ కార్యాలయం ముట్టడికి టీడీపీ నేతలు యత్నించారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. డీజీపీ కార్యాలయ ప్రధాన ద్వారాన్ని తోసుకుని లోపలకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

దీంతో, గేట్ ఎక్కి లోపలకు దూకేందుకు ప్రయత్నించారు. డీజీపీ కార్యాలయం ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. వారిని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Telugudesam
AP DGP
Atchannaidu
  • Loading...

More Telugu News