Vaishnav Tej: షూటింగ్ లో చిరంజీవికి కోపం తెప్పించిన వైష్ణవ్ తేజ్

Vaishnav Tej caused to Chiranjeevi fury

  • ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
  • శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో బాలనటుడిగా పరిచయం
  • షూటింగ్ చేస్తుండగా నవ్విన వైనం
  • సీరియస్ అయిన చిరంజీవి

మెగా ఇంటి నుంచి వచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు. వైష్ణవ్ తేజ్ తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం ద్వారా బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వైష్ణవ్ తేజ్ ఆ సినిమాలో ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా, అచేతనంగా ఉండే బాలుడిగా కనిపిస్తాడు. 

కాగా, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా వైష్ణవ్ తేజ్ పంచుకున్నాడు. ఆ సినిమాలో తన పాత్రకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని, కేవలం వీల్ చెయిర్ లో కూర్చుని ఉండడమేనని తెలిపాడు. 

కానీ, ఓ సీన్ చేస్తుండగా బాగా నవ్వొచ్చిందని, దాంతో సెట్స్ మీద ఉన్న పెద్ద మామయ్య చిరంజీవి కోప్పడ్డాడని వెల్లడించాడు. ఆ సినిమాలో తాను పోషించిన పాత్ర అస్సలు కదలకూడదని, తాను నవ్వేసరికి మామయ్య  సీరియస్ అయ్యాడని వివరించాడు. ఇక తమ కుటుంబ సభ్యులందరం ఏదైనా కార్యక్రమంలో కలిస్తే.. చిరంజీవి మామయ్య "ఒరేయ్" అని పిలిస్తే చాలు... అందరం పలుకుతామని తెలిపాడు.

Vaishnav Tej
Chiranjeevi
Shankar Dada MBBS
Mega Family
  • Loading...

More Telugu News