Sameera Reddy: నీటి కొలనులో సమీరా రెడ్డి.. నాటి ప్రత్యేక ఫొటో షూట్ ను పోస్ట్ చేసిన నటి

Sameera Reddy posts throwback video of underwater pregnancy shoot
  • రెండో విడత గర్భదారణ సమయంలో మేటర్నిటీ ఫొటో షూట్
  • నాటి వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన సమీరా
  • మహిళలు తమ శరీరాన్ని చూసి సిగ్గు పడొద్దని సూచన
నటి సమీరారెడ్డి 2019లో రెండో సారి గర్భం దాల్చింది. ఆ సందర్భంలో ఆమె నీటి కొలనులోకి దిగి ప్రత్యేకంగా అండర్ వాటర్ మేటర్నిటీ ఫొటో షూట్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలతో కూడిన వీడియోను ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. 

మహిళలు తమ శరీరాన్ని ప్రేమించే విధంగా ప్రోత్సహించడమే ఆమె ఫొటో షూట్ ఉద్దేశ్యం. గర్భంలో బేబీ ఉండగా, తాను ఎంతో అందమైన బాడీని కలిగి ఉన్నానంటూ సమీరారెడ్డి పోస్ట్ పెట్టింది. 

‘‘నా బిడ్డలను మోస్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నానో చూడండి. సంబరాలను జరుపుకోవడం అద్భుతం. దీన్ని మర్చిపోవద్దు’’ అని సమీరారెడ్డి పేర్కొంది. మహిళలు తమ శరీరాన్ని చూసి సిగ్గు పడకూడదని, సంతోషంగా సంబరాలు జరుపుకోవాలని ఆమె కోరడం గమనార్హం. (ఇన్ స్టా గ్రామ్ వీడియో కోసం)
Sameera Reddy
underwater
pregnancy shoot

More Telugu News