Congress: ఇందిర మాదిరే ప్రియాంక మెద‌క్ నుంచి పోటీ చేయాలి: వీహెచ్‌

v hanumantha rao proposes priyanka gandhi to contest from medak

  • 1980లో మెద‌క్ నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ
  • 1984 వ‌ర‌కు మెద‌క్ పార్ల‌మెంటు స‌భ్యురాలిగా కొన‌సాగిన వైనం
  • నాన‌మ్మ మాదిరే ప్రియాంక మెద‌క్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలంటున్న వీహెచ్‌

తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌... కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ వి.హనుమంతరావు తాజాగా ఓ కొత్త డిమాండ్‌ను తెర ముందుకు తీసుకొచ్చారు. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతూ ఇటీవ‌లే ద‌క్షిణాది రాష్ట్రాల పార్టీ ఇంచార్జీగా నియ‌మితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రా తెలంగాణ‌లోని మెద‌క్ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న ఓ కొత్త ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చారు. 

త‌న ప్ర‌తిపాద‌న‌కు బ‌లం చేకూరేలా ఆయ‌న ఓ కీల‌క ప‌రిణామాన్ని ప్ర‌స్తావించారు. గ‌తంలో పార్టీ అధినేత్రిగా వ్య‌వ‌హ‌రించిన భార‌త మాజీ ప్ర‌ధాన మంత్రి ఇందిరా గాంధీ మెద‌క్ నుంచి పోటీ చేసి గెలిచిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. 1980లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇందిరా గాంధీ మెద‌క్ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. 1984 వ‌ర‌కు ఆమె మెద‌క్ పార్ల‌మెంటు స‌భ్యురాలిగా కొన‌సాగారు. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన వీహెచ్‌... త‌న నాన‌మ్మ మాదిరే ప్రియాంకా గాంధీ కూడా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మెద‌క్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న ప్ర‌తిపాదించారు.

Congress
Telangana
Medak
V Hanumantha Rao
Indira Gandhi
Priyanka Gandhi
  • Loading...

More Telugu News