Telangana: గిరిజ‌న నృత్యాల్లో తెలంగాణ మ‌హిళా మంత్రి... ఇవిగో ఫొటోలు

ts lady minister satyavathi rathod attends teej fest
  • వేడుక‌గా జ‌రిగిన తీజ్ ఉత్స‌వాలు
  • కల్వకుర్తి మండలంలో ఉత్స‌వాల‌కు హాజ‌రైన స‌త్య‌వతి రాథోడ్‌
  • గిరిజ‌నంతో క‌లిసి ఆడిపాడిన మ‌హిళా మంత్రి
టీఆర్ఎస్ మ‌హిళా నేత‌, తెలంగాణ గిరిజ‌న‌, మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తీజ్ ఉత్స‌వాల్లో భాగంగా ఆదివారం సంద‌డి చేశారు. గిరిజ‌నంతో క‌లిసి ఆమె సంప్ర‌దాయ గిరిజ‌న నృత్యాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. గిరిజ‌న సామాజిక వ‌ర్గానికే చెందిన స‌త్య‌వ‌తి రాథోడ్‌... తెలంగాణ‌లో గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి గిరిజ‌న మ‌హిళా నేతగా రికార్డుల‌కెక్కారు.

గిరిజ‌నులు ఉత్సాహంగా జ‌రుపుకునే తీజ్ ఉత్స‌వాల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జయప్రకాష్ నగర్ తండాలో గిరిజ‌నులు వేడుక‌గా ఉత్స‌వాలు నిర్వ‌హించారు. ఈ వేడుకల‌కు హాజ‌రైన స‌త్య‌వ‌తి రాథోడ్‌.. గిరిజ‌నుల‌తో క‌లిసి ఆడి పాడారు. గిరిజ‌న సంప్ర‌దాయ వ‌స్త్రాన్ని త‌ల‌పై చుట్టుకుని ఆమె ఉత్స‌వాల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.
Telangana
Nagarkurnool District
TRS
Satyavathi Rathod
Teej

More Telugu News