Mahesh Babu: పొద్దున్నే స్విమ్మింగ్​ పూల్​ లో మహేశ్ బాబు.. ఫొటోలు షేర్​ చేసిన నమ్రతా శిరోద్కర్​

Namrata shares pics of mahesh babu swimming

  • ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టిన మహేశ్ అర్ధాంగి
  • తలకు స్విమ్మింగ్ క్యాప్.. ప్రత్యేక కళ్లద్దాలతో ఉన్న మహేశ్ 
  • ‘అప్పుడప్పుడూ శనివారాలు పొద్దున్నే ఇలా..’ అంటూ క్యాప్షన్

టాలీవుడ్‌ హీరోలలో మహేశ్ బాబు కొంత స్పెషల్‌. పెద్దగా ప్రచారంలో ఉండడు. సినిమాలు, టీవీ యాడ్స్‌ లో కనిపించినా.. మామూలు సమయాల్లో తనేమిటో, తన కుటుంబం ఏమిటో అన్నట్టుగా ఉంటుంటాడు. అయితే మహేశ్ బాబు భార్య, మాజీ సినీ నటి నమ్రతా శిరోద్కర్‌ మాత్రం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారు. తన ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్లో తరచూ తమ ఫ్యామిలీ ఫొటోలు పెడుతూ అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె మహేశ్ బాబు స్విమ్మింగ్‌ పూల్‌ లో ఉన్న ఫొటోలను తన ఇన్‌ స్టా అకౌంట్‌ లో పోస్టు చేశారు.

అప్పుడప్పుడూ శనివారం పొద్దున ఇలా..
‘అప్పుడప్పుడూ శనివారం పొద్దున స్విమ్మింగ్‌ పూల్‌ లో ఇలా..’ అని క్యాప్షన్‌ తో మహేశ్ బాబు ఫొటోలను నమ్రత ఇన్‌ స్టా అకౌంట్‌ లో పెట్టారు. దానికి ‘టూ కూల్‌ ఫర్‌ ది పూల్‌’ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా జోడించారు. ఈ ఫొటోల్లో స్విమ్మింగ్‌ పూల్‌ లో నడుములోతు వరకు మునిగి ఉన్న మహేశ్  బాబు.. జుత్తు దెబ్బతినకుండా తలకు స్విమ్మింగ్‌ క్యాప్‌ ధరించి, స్విమ్మింగ్‌ గాగుల్స్‌ పెట్టుకుని ఉన్నారు. ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

  

Mahesh Babu
Namratha
Movie news
Offbeat
Viral Pics
Instagram
  • Loading...

More Telugu News